Telangana : రైతులకు గుడ్ న్యూస్...ఒట్టేసి చెప్పి మరీ.. చెప్పింది చెప్పినట్లుగా.. ఎల్లుండితో పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ

తెలంగాణ రైతులతో ఆగస్టు 15వ తేదీతో రుణవిముక్తులవుతున్నారు.

Update: 2024-08-13 04:17 GMT

తెలంగాణ రైతులతో ఆగస్టు 15వ తేదీతో రుణవిముక్తులవుతున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. అయితే పార్లమెంటు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి ఆగస్టు 15వ తేదీలోగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. వివిధ ప్రాంతాల్లో వివిధ దేవుళ్లపై ఆయన ఒట్టు వేసి మరీ చెప్పారు. తమ మాట నమ్మాలంటూ ప్రజల వద్దకు వెళ్లిన కాంగ్రెస ప్రభుత్వానికి ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు వచ్చాయి. డేట్ తో సహా చెప్పడంతో రైతులతో పాటు అందరూ కనెక్ట్ అయ్యారు.

ఆగస్టు 15వ తేదీలోపు...
అయితే ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీని ఏకకాలంలో చేయకపోతే ఏం చేస్తారని విపక్షాలు ప్రశ్నించాయి. నిజంగా అలా జరిగితే తాము తమ పదవికి రాజీనామా చేస్తామని హరీశ్‌రావు లాంటి నేతలు శపథాలు కూడా చేశారు. రాజీనామా లేఖలను కూడా తయారు చేసి బయటకు వచ్చారు. అయితే రేవంత్ రెడ్డి చెప్పింది చెప్పనిట్లుగానే మూడు విడతలుగా రైతు రుణమాఫీ చేశారు. ఎల్లుండి అంటే ఆగస్టు 15వ తేదీ నాటికి రైతు రుణమాఫీ ప్రక్రియ మొత్తం పూర్తి కానుంది.
ఏకకాలంలో....
నిజానికి ఇది ఒక రికార్డు అని చెప్పాలి. రుణమాఫీ కారణంగా తెలంగాణలో 32.50 లక్షల మంది రైతులు లబ్దిపొందుతున్నారు. ఇందుకోసం తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం 31 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. తొలి విడతగా లక్ష లోపు రుణాలను తీసుకున్న రైతుల రుణమాఫీ చేసింది. దీనివల్ల 11.14 లక్షల మంది లబ్డిపొందారు. రెండో విడత కింద లక్ష నుంచి లక్షన్నర వరకూ రైతు రుణమాఫీ చేశారు. దీని వల్ల 6.40 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు. ఎల్లుండి మూడో విడత రెండు లక్షల రైతు రుణమాఫీ చేయనున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో దీనిని రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.


Tags:    

Similar News