నేటి నుంచి మద్యం ధరలు తగ్గాయ్
తెలంగాణ ప్రభుత్వం మద్యంప్రియులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది
తెలంగాణ ప్రభుత్వం మద్యంప్రియులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫుల్ బాటిల్‌పై నలభై రూపాయలు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. హాఫ్ బాటిల్‌పై ఇరవై రూపాయలు, క్వార్టర్ బాటిల్ పై పది రూపాయలు తగ్గించింది.
పొరుగు రాష్ట్రాల నుంచి...
తెలంగాణలో అధిక ధరల కారణంగా బయట రాష్ట్రాల నుంచి మద్యం వస్తుందని భావించిన ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి ధరల తగ్గింపు ప్రతిపాదనను పంపింది. దీంతో ప్రభుత్వం ఆదాయానికి గండిపడుతున్న నేపథ్యంలో మద్యం ధరలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని బ్రాండ్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. బీర్ల ధరలు మాత్రం యధాతధంగా ఉంటాయని తెలంగాణ ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఎన్నికల ఏడాది కావడంతో మద్యం ధరలు తగ్గించారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.