టీఎస్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై డాక్టర్లు...?

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్యులు ప్రయివేటు ప్రాక్టీస్ చేయడంపై నిషేధం విధించింది

Update: 2022-06-07 12:13 GMT

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్యులు ప్రయివేటు ప్రాక్టీస్ చేయడంపై నిషేధం విధించింది. కొత్తగా ఉద్యోగాలలో చేరే వైద్యులకు మాత్రమే ఈ నిషేధం వర్తిస్తుంది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరే వైద్యులు ఇక ప్రయివేటు ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనలను ప్రభుత్వం సవరిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

నిబంధనలను సవరించి....
ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోకంటే ప్రయివేటు ఆసుపత్రుల్లోనే ఎక్కువ సమయం ఉండటం, వాటికే ప్రాధాన్యత ఇస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో వైద్యులతో పాటు స్టాఫ్ నరస్ులు, ఏఎన్ఎంలు, పారా మెడికల్ స్టాఫ్ ను కొత్తగా నియమించాలనుకున్న ప్రభుత్వం వైద్యుల విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 12,755 వైద్య సిబ్బందిని తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయాలనుకుంటోంది.


Tags:    

Similar News