కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై స్టే

సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ కు ఎదురు దెబ్బ తగిలింది. కాళేశ్వరం మూడో టీఎంసీ పనులపై స్టే విధిస్తూ తీర్పు చెప్పింది.

Update: 2022-07-27 07:52 GMT

సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ కు ఎదురు దెబ్బ తగిలింది. కాళేశ్వరం మూడో టీఎంసీ పనులపై స్టే విధిస్తూ తీర్పు చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ వ్యవహారంలోనూ సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. యధాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 23వ తేదీకి వాయిదా వేసింది. జస్టిస్ ఎఎం ఖన్వీల్కర్, జస్టిస్ అభయ్ ఎన్ ఓకా, జేబీ పర్దివాలా ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.

మూడో టీఎంసీ...
ఆగస్టు 23వ తేదీలోగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు పర్యావరణ అనుమతులున్నాయా? అని ప్రశ్నించింది. అనుమతులు లేకుండా ఎలా పనులు చేపడతారని ప్రశ్నించింది.


Tags:    

Similar News