నేడు రైతు బంధు పథకం నిధుల విడుదల
తెలంగాణలో నేడు రైతు బంధు పథకం కింద ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది. రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేయనుంది
తెలంగాణలో నేడు రైతు బంధు పథకం కింద ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది. రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేయనుంది. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతు బంధు నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది. తొమ్మిదో విడతగా ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు ప్రతి ఏటా పదివేల రూపాయలు రైతు బంధు పథకం రూపంలో నగదును చెల్లిస్తుంది. ఇవి పంటలు వేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ప్రాధాన్యత క్రమంలో...
అయితే ఈరోజు ఎకరా నుంచి వరసగా పెంచుకుంటూ రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదును వేయనున్నారు. మొత్తం 7,654 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 68.94 లక్షల మంది లబ్ది పొందనున్నారు. ఇప్పటికే ఈ నిధులు విడుదల కావాల్సి ఉంది. అయితే ఈసారి నిధుల లేమి కారణంగా కొంత ఆలస్యమయింది. అయితే కేసీఆర్ ఆదేశాలతో నేడు రైతు బంధు పథకం నిధులను అధికారులు దశల వారీగా విడుదల చేయనున్నారు.