ఎన్ని అవమానాలైనా తగ్గేదేలే : గవర్నర్
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. గవర్నర్ అధ్యక్షతన రాజ్‌భవన్‌లో మహిళ సమ్మేళనం జరిగింది. మహిళ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా ప్రత్యేకంగా వివిధ వర్గాల మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ప్రసంగించారు. రాజకీయాల్లో అవకాశాల కోసం మహిళలు కష్టపడాలన్నారు. తాను గవర్నర్ గా బాధ్యతలను చేపట్టినప్పుడు రాష్ట్రంలో ఒక్క మహిళ మంత్రి కూడా లేరని, తర్వాత తాను మహిళ మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించానని తెలిపారు.
రక్తంతో చరిత్ర...
తనకు ప్రొటోకాల్ ఇచ్చినా ఇవ్వకపోయినా తన పని తాను చేసుకుంటూ వెళతానని తమిళి సై సౌందర్ రాజన్ తెలిపారు. ఎన్ని అవమానాలైనా తగ్గను అని ఆమె చెప్పారు. తనపై రాళ్లు విసిరితే వాటిని పేర్చుకుంటూ భవంతులు కడతానని తమిళి సై సౌందర్ రాజన్ అన్నారు. అలాగే దాడి చేసి రక్తం చూస్తే ఆ రక్తాన్ని సిరాగా మార్చి చరిత్ర ను రాస్తానని గవర్నర్ అన్నారు. ఈరోజు గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. తాను అనుకున్నదే చేస్తానని, ఎవరో ఏదో చెప్పారని తాను చేయనని ఆమె స్పష్టం చేశారు.