గవర్నర్ కు తృటిలో తప్పిన ప్రమాదం

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె తమిళనాడులో ఒక కార్యక్రమంలో కిందపడిపోయారు

Update: 2023-02-20 04:09 GMT

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె తమిళనాడులో ఒక కార్యక్రమంలో కిందపడిపోయారు. కార్పెట్ సరిగా వేయకపోవడంతో చూసుకోకుండా వేగంగా నడుస్తున్నందున ఆమె కాలు తడబడి జారి కిందపడినట్లు చెబుతున్నారు.

కాలు జారి కింద పడటంతో...
తమిళనాడులోని హైబ్రిడ్ రాకెట్ లాంచ్ ఈవెంట్ లో తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి వస్తున్న సందర్భంగానే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వెంటనే సెక్యూరిటీ సిబ్బంది గవర్నర్ ను పైకి లేపారు. అయితే ఈ ప్రమాదంలో ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదని చెబుతున్నారు.


Tags:    

Similar News