తమిళిసై ఢిల్లీ పర్యటన... ఇక స్పీడందుకుంటుందా?
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. గవర్నర్ గా నియమితులై తమిళిసై దాదాపు నాలుగేళ్లు పైనే అవుతుంది. ఇప్పటి వరకూ అధికారిక కార్యక్రమాలకు తప్ప తమిళిసై ఢిల్లీ ఎప్పుడు వెళ్లలేదు. అయితే అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీ డైరెక్షన్స్ కోసమే తమిళిసై ఢిల్లీ వెళ్లారా? అని రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతోంది. తమిళి సై నేడు హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.
నివేదికలు ఇవ్వడం....
మామూలుగా అయితే గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యనకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. గవర్నర్లు ఢిల్లీ వెళ్లి హోంమంత్రిని కలిసి నివేదికలు సమర్పించడం మామూలే. కానీ గత కొంతకాలంగా గవర్నర్ తమిళిసైకు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య గ్యాప్ పెరిగింది. రాజ్ భవన్ కు వెళ్లేందుకు కూడా సీఎం ఇష్టపడటం లేదు. బడ్జెట్ సమావేశాల ప్రారంభాన్ని కూడా గవర్నర్ ప్రసంగం లేకుండా ముగించేశారు. మరోవైపు బీజేపీ పై కేసీఆర్ కాలు దువ్వుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళిసై ఢిల్లీ పర్యటన పై రాజకీయంగా చర్చ జరుగుతోంది.