Telangana: ఆ జిల్లాలో గృహజ్యోతి పథకం నిలిపివేత.. కారణం ఏంటో తెలుసా?

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా

Update: 2024-03-07 13:30 GMT

Telangana Gruhalakshmi

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గృహజ్యోతి పథకం అమలు జరుగుతుంటే ఆ జిల్లాలో మాత్రం వాయిదా పడింది. మిగిలిన ప్రాంతాల్లో లబ్ధిదారులు 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందుతుంటే పాలమూరు జిల్లా ప్రజలు మాత్రం మరో మూడు నెలలు పాటు ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో కొత్త పథకాలు అమలు నిలిచిపోయింది.

జీరో బిల్లులు కాకుండా గతంలో మాదిరిగానే పాలమూరు జిల్లా ప్రజలు ఎన్ని యూనిట్ల విద్యుత్ వాడుకుంటే అంతకు బిల్లు కట్టాల్సిందే. ఉమ్మడి మహబూబ్‎నగర్ జిల్లాలో ఉచిత కరెంట్ పథకం అమలునకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఫిబ్రవరి 27న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‎ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ప్రభుత్వ కొత్త పథకాలు అమలు చేసేందుకు వీలు లేకుండా పోయింది.

గత నెల 27 నుంచి ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఉపఎన్నికల కోడ్ అమలులో ఉంది. మార్చి 28న ఎన్నికల జరుగుతాయి. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు చేస్తారు. ఈ ఎన్నికల కోడ్ నడుస్తుండగానే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో మూడు నెలల పాటు గృహ జ్యోతి పథకం అందే అవకాశాలు లేనట్లే.

Tags:    

Similar News