ఫోన్ ట్యాపింగ్ కేసులో తీర్పు ఎల్లుండి
ఫోన్ ట్యాపింగ్ పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.
ఫోన్ ట్యాపింగ్ పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తమకు బెయిల్ ఇవ్వాలంటూ ఈ కేసులో అరెస్టయిన భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు విచారణ సందర్భంగా వారి తరపున న్యాయవాది అక్రమంగా అరెస్ట్ చేశారని, వారికి బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
బెయిల్ ఇవ్వవద్దంటూ...
అయితే ఈ కేసులో వారికి బెయిల్ ఇవ్వవద్దని తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది వాది వాదించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్ని ఆధారాలున్నాయని, వారు బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఎల్లుండికి రిజర్వ్ చేసింది. ఎల్లుండి తీర్పు చెప్పనుంది.