విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇంటర్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నిర్వహించే..
తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇంటర్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నిర్వహించే ఇంటర్ వార్షిక పరీక్షల్లో ప్రశ్నల ఛాయిస్ ను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్ పరీక్షల పేపర్లలో ప్రశ్నల సంఖ్యను పెంచింది. గతంలో కొన్ని సెక్షన్ల వరకే ఛాయిస్ ఉండేది. ఈ ఏడాది మాత్రం అన్ని సెక్షన్లలోనూ ఛాయిస్ ఇవ్వనుంది ఇంటర్ బోర్డు. 2021-22 సంవత్సరానికి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలకు చెందిన.. మోడల్ ప్రశ్నపత్రాలను ఇంటర్ బోర్డు అధికారులు వెబ్‌సైట్‌లో పెట్టారు.
Also Read : వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
గత ఏడాది మూడు సెక్షన్లకు రెండింటిలో మాత్రమే 50 శాతం ఛాయిస్ ప్రశ్నలు ఇవ్వగా.. ఇప్పుడు మూడు సెక్షన్లలో ఛాయిస్ ప్రశ్నలు ఇచ్చారు. కరోనా కారణంగా ఇంటర్, టెన్త్ విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పాస్ అవుతూ వచ్చారు. గతేడాది ఇంటర్ పరీక్షలు నిర్వహించినా.. చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దాంతో.. ఈ ఏడాది ఛాయిస్ ను పెంచుతున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. తెలంగాణలో ఏప్రిల్ లో ఇంటర్ పరీక్షలు మొదలవ్వనున్నాయి.