తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం... ఇంటర్ ప్రశ్నల్లో?
కరోనా థర్డ్ వేవ్ తీవ్ర రూపం దాలుస్తుండటంతో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కరోనా థర్డ్ వేవ్ తీవ్ర రూపం దాలుస్తుండటంతో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంటర్ పరీక్ష ప్రశ్నా పత్రాల్లో మార్పులు చేసేందుకు సిద్దమయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాడి ఇంటర్ పరీక్షలలో ఛాయిస్ ను పెంచాలన్నది ఇంటర్ బోర్డు ఆలోచన. సైన్స్ పరీక్ష పత్రాల్లో రెండు మార్కుల ప్రశ్నల్లో ఛాయిస్ ను ఈ ఏడాది పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమచారం.
ప్రశ్నలు పెంచి.. ఛాయిస్ ....
సైన్స్ ప్రశ్నాపత్రాల్లో పది ప్రశ్నలకు పది ఆన్సర్లు రాయాల్సి ఉండగా ఈ ఏడాది పదిహేను ప్రశ్నలు ఇస్తారు. వాటిలో పది ప్రశ్నలకు జవాబు రాయాల్సి ఉంటుంది. ఆర్ట్స్ గ్రూపుల్లోనూ పది మార్కుల ప్రశ్నలు ఏడింటికి మూడింటికి జవాబు రాయాల్సి ఉంటుంది. ఐదు మార్కుల ప్రశ్నలకు పద్దెనిమిది ఇస్తారు. వీటిలో ఎనిమిది ప్రశ్నలకు జవాబు రాయాల్సి ఉంటుంది. మే 2వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు జరపాలన్నది బోర్డు ప్రాధమికంగా నిర్ణయించింది.