Rain Alert : ఐదు రోజుల పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన
తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది
తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో సిద్ధిపేట జిల్లాలో భారీ వర్షపాతం నమోదయిందని తెలిపింది.
ఈ జిల్లాల్లో
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.