రుచి ఎలా ఉంది? అల్పాహార పథకం ప్రారంభంలో మంత్రి కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభమైంది. సికింద్రాబాద్‌ వెస్ట్‌..

Update: 2023-10-06 06:38 GMT

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభమైంది. సికింద్రాబాద్‌ వెస్ట్‌ మారేడుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో పథకాన్నిమంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో కలిసి టిఫిన్‌ చేశారు. టిఫిన్‌ రుచి ఎలా ఉందంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు మంచి పోషకాలు అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించామని మంత్రి కేటీఆర్ అన్నారు. ‌ఎప్పటికప్పుడు బ్రేక్‌ఫాస్ట్ నాణ్యతను చెక్‌చేయాలని అధికారులను ఆదేశించారు.

అటు రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో మంత్రులు హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు కూడా ఈ పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు వడ్డించే అల్పాహారాన్ని పరిశీలించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ఆపై విద్యార్థులకు అల్పాహారం వడ్డించారు.. అనంతరం మంత్రులు ఇరువురు విద్యార్థులతో కలిసి టిఫిన్‌ చేశారు. పిల్లలకు మంచి పోషకాలు అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించినట్లు మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈ పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందిస్తున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు డ్రాపౌట్లను తగ్గించి, హాజరు శాతాన్ని పెంచడానికి ఈ పథకం ఉపయోగపడనుంది. తెలంగాణలో 27,140 స్కూళ్లలో 23లక్షల మంది విద్యార్ధులకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
Tags:    

Similar News