సీఎం కేసీఆర్ కామెంట్స్ పై సీరియస్.. పోలీసులకు ఫిర్యాదు

సీఎం కేసీఆర్ కామెంట్స్ పై సీరియస్.. పోలీసులకు ఫిర్యాదు

Update: 2022-07-13 11:40 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో హిందూ సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. హిందూ దేవతలను కించపరుస్తూ కేసీఆర్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో ఉన్న ప్రముఖ దేవతలను కీర్తించారని.. దీనిని రాజకీయంగా తప్పు పడుతూ ఆదివారం (జూలై 10) నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ హిందూ దేవతలను కించపరిచేలా వ్యాఖ్యానించారని హిందూ సంఘాల నాయకులు ఆరోపించారు. కేసీఆర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామని సదరు నాయకులు తెలిపారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో:
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇటీవల జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ లో ఉన్న ప్రముఖ దేవతలను కీర్తించారని, దీనిని రాజకీయంగా తప్పు పడుతూ జులై 10వ తేదీన నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ హిందూ దేవతలను కించపరిచేలా వ్యాఖ్యానించారని వీహెచ్‌పీ తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని భజరంగ్ దళ్ నాయకుడు అభిషేక్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో న్యాయ సలహా తీసుకుని, తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీస్ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై వెంటనే కేసు నమోదు చేయాలని భజరంగ్ దళ్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్ డిమాండ్ చేశారు. జోగులాంబ అమ్మవారిని కించపరిచే విధంగా చేసిన వాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. హిందు దేవతపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, శక్తి పీఠం జోగులాంబ అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే హిందువులు సహించరన్నారు. రాజకీయాలు చేసుకోండి.. హిందు దేవతలను కించపరిస్తే సహించమని హెచ్చరించారు. గతంలో హిందుగాళ్ళు, బొందు గాళ్ళు అంటూ.. హిందువులను కించపరిచారని, కేసీఆర్ పై అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు.


Tags:    

Similar News