డీహెచ్ శ్రీనివాసరావుకు కరోనా

తెలంగాణ వైద్య ఆరోగ్య సంచాలకులు శ్రీనివాసరావుకు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు కనపడటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు

Update: 2022-01-18 11:42 GMT

తెలంగాణ వైద్య ఆరోగ్య సంచాలకులు శ్రీనివాసరావుకు కరోనా సోకింది. ఆయనకు స్వల్ప లక్షణాలు కనపడటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన ముందు జాగ్రత్త చర్యగా హోం ఐసొలేషన్ లో ఉన్నారు. ప్రస్తుతం చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు.

ఆందోళన అనవసరం...
స్వల్ప లక్షణాలు ఉండటంతో తాను ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నానని శ్రీనివాసరావు వెల్లడించారు. ఏ విధమైన ఆందోళనలు, అపోహలు వద్దని, త్వరలో పూర్తి స్వస్థత తో ముందుకు వస్తానని, కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని శ్రీనివాసరావు కోరారు.


Tags:    

Similar News