Harish Rao : నామినేషన్ దాఖలు చేసిన హరీశ్
తెలంగాణ మంత్రి హరీశ్‌రావు సిద్ధిపేట నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు.
తెలంగాణ మంత్రి హరీశ్‌రావు సిద్ధిపేట నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో హరీశ్ రావు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. హరీశ్ రావు మొత్తం రెండు సెట్ల నామినేషన్ ను దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే ముందు సిద్ధిపేటలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పత్రాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే సంతకాలు చేసిన హరీశ్ రావు ఆ తర్వాత ఊరేగింపుగా బయలుదేరి ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు.
రెండు దశాబ్దాల నుంచి...
దాదాపు రెండు దశాబ్దాల నుంచి హరీశ్ రావు సిద్ధిపేట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతి ఎన్నికకు ఆయన మెజారిటీ పెరగిపోతూనే ఉ:ది. 2004 ఉప ఎన్నికల్లో 24,827 ఓట్ల మెజారిటీ సాధించిన హరీశ్ రావు 2018 ఎన్నికల్లో 1,18,699 మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి ఆ మెజారిటీ అధిగమించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. అభివృద్ధి నినాదంతో హరీశ్ రావు ఈసారి ఎన్నికల్లో రాష‌్ట్రంలోేనే అత్యధిక మెజారిటీని సాధించి తన రికార్డును తానే అధిగమించాలని ఆశిస్తున్నారు.