సిగరెట్ అలవాటు కూడా లేదు.. డ్రగ్స్ తీసుకుంటా అంటున్నారు: కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో దిగజారిన, దిక్కుమాలిన ప్రతిపక్షాలతో కొట్లాడటం మా దురదృష్టమని మంత్రి కేటీఆర్ అన్నారు. నోరు ఉంది కదా

Update: 2023-06-28 03:02 GMT

తెలంగాణ రాష్ట్రంలో దిగజారిన, దిక్కుమాలిన ప్రతిపక్షాలతో కొట్లాడటం మా దురదృష్టమని మంత్రి కేటీఆర్ అన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు కేటీఆర్. అనడం పెద్ద సమస్య కాదని.. నేను కూడా అనగలనని అన్నారు. జీవితంలో సిగరెట్ కూడా తాగలేదని.. అలాంటిది తనకు డ్రగ్స్ తో లింక్స్ ఉన్నాయని అంటున్నారని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ప్రతి పక్షాలు దమ్ముంటే సిద్ధాంతాలు, విధానాల మీద మాట్లాడాలని.. అంతేకానీ తండ్రి తాగుబోతు, కొడుకు తిరుగుబోతు అంటున్నారని అన్నారు. ఇవా మాట్లాడేది. ఆఖరికి నా కొడుకు గురించి మాట్లాడుతారు. వ్యక్తిత్వ హననం చేస్తారని కేటీఆర్ తెలిపారు. మేం వదిలించుకున్న వాళ్లను నెత్తిన పెట్టుకుని.. అదెదో గొప్ప విజయంగా కాంగ్రెస్‌ నాయకులు ఊరేగుతున్నారని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇస్తానంటే వద్దనుకుని ఆ పార్టీలోకి వెళ్లిన వాళ్లు ఎవరైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. కొల్లాపూర్‌లో హర్షవర్దన్‌రెడ్డికి టికెట్‌ ఇస్తారని అర్థమైన తర్వాతనే జూపల్లి పార్టీ మారారని స్పష్టం చేశారు. పొంగులేటి కూడా ఇక్కడ ఆశ్రయం లేదని అర్థమయ్యాకే కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారని తెలిపారు. ఈ ఇద్దరికీ టికెట్‌ ఇస్తే పార్టీ మారే వాళ్లా అని ప్రశ్నించారు. ఏ దిక్కు లేకపోవడం వల్లనే వాళ్లు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారని చెప్పారు.

అభివృద్ధిలో పోటీపడుదామని.. మేం ఒక్క మంచిపనిచేస్తే.. మీరు రెండు మంచి పనులు చేయాలని అన్నారు. ఈ పరస్పర దూషణలు, వ్యక్తిత్వ హననాలు. వ్యక్తిగత దూషణలు సరికాదని అన్నారు. కేసీఆర్‌ వయసెంత.. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ల వయసెంత? కేసీఆర్‌ 70 ఏళ్ల నాయకుడన్నారు. తెలంగాణ కోసం 14 ఏండ్లు కష్టపడి 23 ఏళ్లు అగ్రగామిగా ఉన్న నాయకుడు. నోటికొచ్చిన బూతులు.. ఎట్ల పడితే అట్ల మాట్లాడడం.. కేసీఆర్‌ను ఎంత ఎక్కువ తిడితే అంత గొప్ప అనే ధోరణి మంచిదికాదన్నారు. కేసీఆర్‌ కంటే ఎక్కువగా తెలంగాణను ప్రేమించడం నేర్చుకోండి. కేసీఆర్‌ కంటే నాలుగు పనులు ఎక్కువ చేస్తామని చెప్పాలని కేటీఆర్ అన్నారు.


Tags:    

Similar News