ఆమెకు గవర్నర్ పదవి అర్హత లేదు

తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2022-09-08 12:00 GMT

తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు మహిళల పట్ల గౌరవం ుందన్నారను. గవర్నర్ తన పరిధి దాటిని వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజ్‌భవన్ కు ప్రగతి భవన్ కు దూరం పెరగలేదని, ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నాయని ఆమె ఎద్దేవా చేశారు. ఎందరో గవర్నర్లు పనిచేసి వెళ్లారని, ఎవరికి రాని ఇబ్బంది ఈమెకే ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదన్నారు. బీజేపీ అధ్యక్షురాలిగానే ఇంకా గవర్నర్ వ్యవహరిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

అది కేసీఆర్ ఇష్టం...
ఆమెకు గవర్నర్ పదవిని నిర్వహించే అర్హత లేదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాజ్‌భవన్ కు ఎప్పుడు రావాలన్నిది ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టమన్నారు. వరదలు వస్తే ప్రభుత్వం ఉండగా, మీకేం పని అని వెళ్లారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ చరిత్ర గవర్నర్ కు తెలియదన్నారు. అందుకే విమోచనదినోత్సవం జరపాలంటున్నారని, లేని సమస్యలను ఉన్నట్లు చూపడం గవర్నర్ కు సమంజసం కాదని మంత్రి అభిప్రాయపడ్డారు. గవర్నర్ గా ఉంటారో? పార్టీ నేతగా వ్యవహరిస్తారో తేల్చుకోవాలని ఆమె కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రతినిధిగా గవర్నర్ వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుందని, కేంద్రం నుంచి వచ్చిన వారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రశంసిస్తే ఈమె మాత్రం ఇలా మాట్లాడటం సరికాదని, గవర్నర్ ఇకనైనా తన వైఖరిని మార్చుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు.


Tags:    

Similar News