ఢిల్లీలో తెలంగాణ మంత్రులు... అపాయింట్ మెంట్ కోసం?

తెలంగాణ మంత్రులు ఢిల్లీలో కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు

Update: 2022-03-23 04:26 GMT

తెలంగాణ మంత్రులు ఢిల్లీలో కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ధాన్యం సేకరణ విషయంలో మంత్రులను కలవాలని ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రల అపాయింట్ మెంట్ కోరారు. కానీ ఇంతవరకూ అపాయింట్ మెంట్ ఖరారు కాలేదు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో మధ్యాహ్నం వీరికి అపాయింట్ మెంట్ లభించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

వరి ధాన్యాన్ని.....
యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, వన్ నేషన్ - వన్ ప్రొక్యూర్ మెంట్ పాలసీని అమలు పర్చాలని తెలంగాణ మంత్రులు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కోరనున్నారు. టీఆర్ఎస్ ఎంపీలతో కలసి వారు ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లు ఈ బృందంలో ఉన్నారు.


Tags:    

Similar News