మాణికం తో రేవంత్ భేటీ

ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారా ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ తో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

Update: 2022-02-28 06:11 GMT

తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ తో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై వీరు చర్చిస్తారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి పాదయాత్ర విషయం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై క్యాలెండర్ ను రూపొందించనున్నారు.

జగ్గారెడ్డి వివాదం....
దీంతో పాటు జగ్గారెడ్డి వ్యవహారం కూడా వీరి మధ్య చర్చకు రానుంది. జగ్గారెడ్డి తాను పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన నిర్ణయాన్ని పదిహేను రోజుల పాటు వాయిదా వేసుకున్నారు. తాను కూడా స్వయంగా ఫోన్ చేసి రాజీనామా ఆలోచనను విరమించుకోవాలని కోరారని రేవంత్ రెడ్డి మాణికం ఠాగూర్ దృష్టికి తీసుకు వచ్చారు.


Tags:    

Similar News