Breaking: ఈడీ ఆఫీసుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Update: 2022-09-27 09:05 GMT

తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఫెమా నిబంధనల ఉల్లంఘనల కేసులో ఆయనను విచారిస్తున్నారు. గతంలోనూ మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. దీంతో ఆయన ఈరోజు హైదరాబాద్ ఈడీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు.

నోటీసులు ఇచ్చి....
మంచికిషన్ రెడ్డి ఫెమా నిబంధనలను ఉల్లంఘించారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈడీ కార్యాలయంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఆయన స్టేట్ మెంట్ ను రికార్డు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి మంచిరెడ్డి కిషన్ రెడ్డి మూడు పర్యాయలు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009, 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మరోమారు విజయం సాధించారు.


Tags:    

Similar News