తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కోవిడ్ కేసులు
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 13,272 మంది శాంపిళ్లను పరీక్షించగా.. 20 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. వాటిలో అత్యధికంగా
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. సోమవారం రాత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 13,272 మంది శాంపిళ్లను పరీక్షించగా.. 20 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. వాటిలో అత్యధికంగా 13 కేసులు హైదరాబాద్ లో నమోదయ్యాయి. ఇదే సమయంలో 35 మంది కరోనా పేషెంట్లు మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,111గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 189 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో 7లక్షల 91వేల 650 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 87వేల 350 మంది కోలుకున్నారు. ఇదిలా ఉండగా దేశరాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. క్రమంలో పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.