తెలంగాణలో స్కూల్స్ కు సంబంధించి కీలక అప్డేట్
మీ ఇళ్లల్లో స్కూల్స్ కు వెళ్లే చిన్నారులు ఉన్నారా.. అయితే తెలంగాణ ప్రభుత్వం కీలక సూచన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల
మీ ఇళ్లల్లో స్కూల్స్ కు వెళ్లే చిన్నారులు ఉన్నారా.. అయితే తెలంగాణ ప్రభుత్వం కీలక సూచన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల పనివేళలను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పాఠశాలలు ఉదయం 9 గంటలకు మొదలవుతున్నాయి. దీన్ని ప్రభుత్వం 9.30 గంటలకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. ప్రాథమిక పాఠశాలల సమయం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15వరకు మార్చింది. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పనివేళ్లల్లో మార్పులు చేసినట్లు వెల్లడించింది. ఈ పని వేళలు జంట నగరాలకు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తించనుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
మళ్లీ సెలవులు ఇవ్వబోతున్నారా:
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఈ కారణంగా పాఠశాలలకు గత గురు, శుక్ర, శనివారం వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇప్పుడు మరోసారి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వర్షాల ధాటికి చాలా చోట్ల విద్యాసంస్థలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుత పరిస్థితులను సమీక్షించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. భారీ వర్షాల కారణంగా మరోసారి సెలవులు ప్రకటించే అవకాశం లేకపోలేదని అంటున్నారు.