తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఈరోజు భారీ వర్షం
తెలంగాణలోనూ రాబోయే రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.;
రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోనూ రాబోయే రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మంగళవారం తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
దేశమంతటా...
తెలంగాణలోని పశ్చిమ, ఉత్తర జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక దేశ వ్యాప్తంగా నైరుతి రుతు పవనాలను తిరోగమన సమయంలోనూ వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. తమిళనాడులో వర్ష బీభత్సంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇక ఉత్తర భారత దేశంలో వర్షాలు వదిలి పెట్టడం లేదు. మరికొద్ది రోజులు ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది