తెలంగాణలో మొదలైన వర్షాలు.. పలు ప్రాంతాల్లో వడగండ్లు

వికారాబాద్, జహీరాబాద్ ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. ఆకాశం నుంచి మంచు ముక్కలు పడటంతో.. ఒక్క సారిగా ఆ ప్రాంతాల్లో..

Update: 2023-03-16 12:35 GMT

halistorms in telangana

జార్ఖండ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణ వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో నాలుగురోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వడగండ్లు, సాధారణ వర్షాలు పడ్డాయి. నిన్నటి నుంచే హైదరాబాద్లో వాతావరణం చల్లబడగా.. ఈరోజు మోస్తరు వర్షం కురిసింది.

వికారాబాద్, జహీరాబాద్ ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. ఆకాశం నుంచి మంచు ముక్కలు పడటంతో.. ఒక్క సారిగా ఆ ప్రాంతాల్లో కశ్మీర్ ను తలపించాయి. వడగండ్ల వానతో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. రానున్న రెండ్రోజుల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన చెదురుమదురు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అలాగే గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.


Tags:    

Similar News