వెనక్కు తగ్గిన టీడీపీ.. పోటీకి దూరం
మునుగోడు ఉప ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది.
మునుగోడు ఉప ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీలో నిన్నటి వరకూ పోటీ చేయాలని అందరూ భావించారు. కార్యకర్తలు కూడా పోటీకి మొగ్గు చూపారు. పోటీకి దిగకపోతే ఓటు బ్యాంకు దూరమవుతుందని హైకమాండ్ కు నచ్చచెప్పేందుకు క్యాడర్ ప్రయత్నాలు చేసింది.
మనసు మార్చుకుని...
అయితే నిన్నటి వరకూ మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయాలని భావించిన టీడీపీ ఈరోజు మాత్రం పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కిన నరసింహులు ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయడం కంటే పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది.
ఈ నెల 15న...
ఈ నెల 15న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. పార్లమెంటు అధ్యక్షులు, కో ఆర్డినేటర్లు, త్రీమెన్ కమిటీ సభ్యులతో చంద్రబాబు సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. ప్రధానంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆయన దృష్టి పెట్టానున్నారు.