Telangana : రికార్డు స్థాయిలో టెంపరేచర్లు

తెలంగాణలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా హాట్ సమ్మర్ మార్చి నెలలోనే కనపడుతుంది.

Update: 2024-03-25 04:03 GMT

తెలంగాణలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా హాట్ సమ్మర్ మార్చి నెలలోనే కనపడుతుంది. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు బయటకు రావడానికి కూడా భయపడిపోతున్నారు. అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటాయి. మరో నాలుగు రోజుల పాటు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అనేక జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించింది.

నలభై డిగ్రీలు దాటి...
నిన్న అత్యధికంగా నల్లగొండ జిల్లా బుగ్గబావి గూడ, నిర్మల్ జిల్లాలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన 21 జిల్లాల్లో నలభై డిగ్రీలు నమోదు కావడంతో ప్రజలు భయపడిపోతున్నారు. రాబోయే నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరముంటే తప్ప బయటకు రావద్దని కూడా సూచనలు వెలువడుతున్నాయి. డీహైడ్రేషన్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువగా మంచినీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News