ఇకపై యాదాద్రిలో డ్రెస్ కోడ్ అమలు

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయంలో భక్తులకు డ్రెస్ కోడ్ తప్పని సరి చేస్తూ ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది.

Update: 2024-05-19 07:52 GMT

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయంలో భక్తులకు డ్రెస్ కోడ్ తప్పని సరి చేస్తూ ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. యాదాద్రిలోని లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వచ్చే భక్తులు విధిగా సంప్రదాయ దుస్తులను ధరించాల్సి ఉంటుంది. జూన్ 1వ తేదీ నుంచి ఈ డ్రెస్ కోడ్ అమలులోకి రానుంది. ఈ విషయాన్ని ఆలయ ఈవో కూడా ధృవీకరించారు.

తిరుమల తరహాలో...
అయితే తిరుమలలో మాదిరగానే వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు వివిధ సేవల్లో పాల్గొనే భక్తులు విధిగా సంప్రదాయ దుస్తులను ధరించాలని ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ఇప్పికే ఆలయంలో అధికారులతో పాటు సిబ్బంది కూడా డ్రెస్ కోడ్ ను పాటిస్తున్నారు. ఇకపై జూన్ 1వ తేదీ నుంచి సంప్రదాయ దుస్తులు ధరించి యాదాద్రికి రావాలని, అప్పుడే వీఐబీ బ్రేక్ దర్శనాలకు, సేవలకు అనుమతిస్తామని ఆయన తెలిపారు.


Tags:    

Similar News