వరంగల్ లో టెన్షన్ ..టెన్షన్
వరంగల్ లో టెన్షన్ ..టెన్షన్ భారీగా మోహరించిన పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు
వరంగల్ లో టెన్షన్ ..టెన్షన్
భారీగా మోహరించిన పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు
హనుమకొండలోని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంప్ ఆఫీస్ను బీజేపీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. బీజేపీ నేత రాకేష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఇంటివద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుతోపాటు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లే రహదారిలో ముళ్లకంచెలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ముళ్ల కంచెలు గుచ్చుకోవడంతో కొంతమందికి గాయాలయ్యాయి.