చల్లటి వార్త.. రానున్న మూడు గంటల్లో వర్షాలు..
కొన్ని రోజులుగా ఎండ వేడితో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు కొంత ఊరట లభించే వార్త. రానున్న మూడు గంటల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
కొన్ని రోజులుగా ఎండ వేడితో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు కొంత ఊరట లభించే వార్త. రానున్న మూడు గంటల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) - హైదరాబాద్ మంగళవారం తెలిపింది. రానున్న మూడు గంటల్లో రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఎల్లో అలర్ట్‌ను కూడా జారీ చేసింది. వర్షాలు కురుస్తున్నప్పటికీ, రానున్న రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 48 గంటల్లో హైద్రాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.