న్యూ ఇయర్ వేడుకలపై నిబంధనలు తప్పవు : సీపీ సీవీ ఆనంద్
ఒమిక్రాన్ వ్యాప్తిని నగరంలో అరికట్టాలంటే.. న్యూ ఇయర్ వేడుకలపై నిబంధనలు తప్పవని తెలిపారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు..
హైదరాబాద్ సీపీగా.. సీవీ ఆనంద్ బదిలీ కావడంతో.. కొద్దిసేపటి క్రితమే ఆయన బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ సృష్టిస్తోన్న అలజడిని గుర్తు చేశారు. ఒమిక్రాన్ వ్యాప్తిని నగరంలో అరికట్టాలంటే.. న్యూ ఇయర్ వేడుకలపై నిబంధనలు తప్పవని తెలిపారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు.. సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు చేపడుతామన్నారు. అలాగే సైబర్ నేరాలను కూడా అరికట్టేందుకు తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు.
అలాగే.. నగరంలో శాంతి, భద్రతలకు విఘాతం కలిగించే అంశాలపై దృష్టి సారిస్తామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. డ్రగ్స్ కట్టడికి ఇప్పటికే డ్రైవ్ కొనసాగుతోందని తెలిపారు. అదేవిధంగా.. మహిళల భద్రతకు కూడా ప్రాధాన్యమిస్తామన్నారు. ఎక్కడైతే చదువుకుని, పెరిగానో అక్కడే సీపీగా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందన్న సీవీ ఆనంద్.. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని తెలిపారు. హైదరాబాద్ సీపీగా తనను నియమించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.