నైట్ కర్ఫ్యూ దిశగా యోచన
తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈరోజు దీనిపై నిర్ణయం తీసుకుంటారు
తెలంగాణలోనూ నైట్ కర్ఫ్యూ విధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈరోజు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. రోజుకు రెండు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులను ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించింది. దీంతో పాటు మరికొన్ని ఆంక్షలను విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ఈరోజు జరిగే....
ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో కరోనా కట్టడిపై చర్చించనున్నారు. ప్రధానంగా నైట్ కర్ఫ్యూ ను విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల సరిహద్దుల వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో కేసులు ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది.