Caste Census Survey : కులగణన సర్వే లో ఈ ఆరు రోజుల్లో ఎంత మంది పాల్గొన్నారంటే?
తెలంగాణలో జరుగుతున్న కులగణన సర్వేకు పెద్దగా రెస్పాన్స్ ఉండటం లేదు;

తెలంగాణలో జరుగుతున్న కులగణన సర్వేకు పెద్దగా రెస్పాన్స్ ఉండటం లేదు. ఎన్యుమరేటర్లు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఉదయం నుంచి ఎండల తీవ్రత ఉండటంతో మొదటి విడత మాదిరిగా ఈ రీసర్వేలో మాత్రం ఎన్యుమరేటర్లు రీసర్వే చేయలేకపోతున్నారు. తెలంగాణలో ఈ నెల 16వ తేదీ నుంచి కులగణన సర్వే ప్రారంభమయింది. అయితే రీసర్వే లోనూ జనం అంతగా పాల్గొనడం లేదు. ప్రజలు ఎవరూ కులగణన సర్వేలో ఆసక్తి కనపర్చడం లేదు.గతంలో జరిగిన సర్వేలో పాల్గొనని వారి కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఈ సర్వేను నిర్వహించినా ప్రయోజనం ఎంత మాత్రం ఉంటుందన్నది అనేది సందేహంగానే కనపడుతుంది. ఇప్పటికి సర్వే ప్రారంభమై ఆరు రోజులవుతున్నా పెద్దగా సర్వే చేయలేదని సమచారం.
వివరాలు చెప్పేందుకు...
హైదరాబాద్ నగరంలోనే తమ వివరాలను చెప్పేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మొన్నటి సర్వేలోనూ హైదరాబాద్ లోనే ఎక్కువ మంది సర్వేకు దూరంగా ఉన్నారు. అందులో వివరాలు తమ ఆస్తుల సంగతి బయటపడతాయని భావించి భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నెల 28వ తేదీ వరకూ కులగణన సర్వే జరుగుతుంది. తెలంగాణలో తొలి దశ సర్వే జరిగినప్పుడు తాళం లేని ఇళ్లు 3.56 లక్షల ఇళ్లు ఉన్నాయని గుర్తించారు. ఈ గృహాలకు చెందిన యజమానులు తిరిగి రీసర్వేలో పాల్గొనాలని ప్రభుత్వం మరో అవకాశమిచ్చింది. వి. కులగణన సర్వే ఆధారంగానే సంక్షేమ పథకాలను అందించే అవకాశాలన్నాయని తెలిసినా ప్రజలు ఆసక్తి కనపర్చడం లేద.
ఆరు రోజులవుతున్నా...
ఇప్పటికి ఆరు రోజులవుతున్నా ఇంకా లక్ష ఇళ్ల సర్వే కూడా పూర్తి కాలేదని అధికారులు చెబుతున్నారు. ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో మిగిలిన లక్షల్లో సర్వే పూర్తి అవుతుందన్న నమ్మకం లేదు. రీ సర్వేలోనూ పూర్తి స్థాయి సర్వే జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. తమ ఇళ్లకు రాని ఎన్యుమరేటర్లు రావాలంటే ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా కేటాయించింది. కులగణన సర్వే లో పాల్గొనని వారు టోల్ ఫ్రీ 040,21111111 నెంబరుకు కాల్ చేయాలని కోరింది. ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని ఎంపీడీవో కార్యాలయాలు, పట్టణాల్లోని వార్డు కార్యాలయాల్లో కులగణన సర్వే వివరాలను అందించ వచ్చని ప్రభుత్వం తెలిపింది. కానీ రెస్పాన్స్ అంతగా లేదు.