ప్రధాని మోడీ రాకకు మూడంచెల భారీ భద్రత

దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అక్టోబర్ 1న మహబూబ్ నగర్ జిల్లాకు మోదీ..

Update: 2023-10-01 06:55 GMT

దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అక్టోబర్ 1న మహబూబ్ నగర్ జిల్లాకు మోదీ వస్తున్నందున మూడంచెల భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ పర్యవేక్షిస్తున్నారు.

భద్రత వవరాలు:

➦ 7 మంది ఎస్పీ క్యాడర్ అధికారులు
➦ 8 మంది అడిషనల్‌ ఎస్పీ క్యాడర్‌ అధికారులు
➦ 18 మంది డీఎస్‌పీ క్యాడర్ అధికారులు
➦ 55 మంది సీఐ, ఆర్‌ఐ క్యాడర్ అధికారులు
➦ 170 మంది ఎస్సై, ఆర్‌ఎస్‌ఐ క్యాడర్ అధికారులు
➦ 1640 మంది - ఏఎస్సై, హెచ్‌, పీసీ హై క్యాడర్ అధికారులు
కాగా, మోడీ వచ్చిపోయేంత వరకు ఎవరు ఎలాంటి విధులు నిర్వహించాలో భద్రతా పరమైన సూచనలు వివరించినట్లు ఎస్పీ తెలిపారు. మోడీ పర్యటన సందర్బంగా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

ట్రాఫిక్ ఆంక్షలు

మహబూబ్‌నగరర్‌ టౌన్ టూ భూత్పూర్ వెళ్లే భారీ వాహనాలకు అనుమతి లేదు. సభకు వచ్చే వాహనాలు మాత్రమే సాక్షి గణేష్ టెంపుల్ దగ్గరలో ఇరువైపుల గల పార్కింగ్ ప్రదేశాల్లో పార్కింగ్ చేయాలి. హైదరాబాద్, జడ్చర్ల వైపు నుంచి సభకు వచ్చే వాహనాలు బూత్పుర్ ఫ్లైఓవర్ ప్రారంభంలో గల కేవీఎన్ ఫంక్షన్ హాల్ పక్కన వున్న ఖాళీ స్థలంలో మాత్రమే పార్కింగ్ చేయాలి. నాగర్ కర్నూలు వైపు నుంచి సభకు వచ్చే వాహనాలు కరువేన గేటు దగ్గర గల పార్కింగ్ ప్రదేశంలో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు పోలీసులు. గద్వాల్, కర్నూల్ వైపు నుంచి వచ్చే సభకు వచ్చే వాహనాలు హైవే మీద గల టాటా మోటార్స్ వెనకాల పార్కింగ్ ప్రదేశంలో పార్కింగ్‌కు అనుమతి ఇచ్చారు. మహబూబ్నగర్ పట్టణం నుంచి వచ్చే వాహనాలు బూత్పూర్ రోడ్లు అనుమతి లేదు. అందుకు జడ్చర్ల హైవే మీదుగా హైదరాబాద్ కర్నూల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఇక రాయచూరు, తాండూర్ వెళ్లవలసిన వాహనాలు జడ్చర్ల దగ్గర ఫ్లైఓవర్ దిగి మహబూబ్నగర్ పట్టణంలోని మీదుగా వెళ్లాల్సి ఉంటుందని, మిడ్జిల్, కల్వకూర్తి, నల్గొండ వైపు నుంచి, రాజాపూర్, బాలానగర్, షాద్ నగర్, హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనదారులకు పోలీసులు సూచనలు చేస్తున్నారు.
భూత్పూర్ ఐటీఐ గ్రౌండ్ నందు జరుగబోయే సమావేశానికి హాజరు అయ్యే వాహనదారులు అందరు కూడా జడ్చెర్ల వద్ద ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి క్రింది నుంచి తమ తమ వాహనాలను మలుపుకొని మహబూబ్ నగర్ వైపు ఉన్న పిస్తా హౌస్ మీదుగా, బై పాస్ రోడ్ 167 జాతీయరహదారి ద్వారా కొత్త కలెక్టర్ కార్యాలయము మీదుగా సమావేశానికి చేరుకోవాలని పోలీసులు సూచించారు.
Tags:    

Similar News