పులులకు కొరవడిన రక్షణ.. మరో పులిచర్మం పట్టివేత

ఆదిలాబాద్ జిల్లాలో పులులు సంరక్షణ కష్టంగా మారింది. పులులను చంపి చర్మాలు, ఇతర అవయవ భాగాలను అమ్ముకుంటున్నారు.

Update: 2021-12-13 03:51 GMT

ఆదిలాబాద్ జిల్లాలో పులులు సంరక్షణ కష్టంగా మారింది. పులులను చంపి చర్మాలు, ఇతర అవయవ భాగాలను అమ్ముకుంటున్నారు. వేటగాళ్ల బారిన పడి పులులు మృతి చెందుతుండటం కలకలం సృష్టిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో మరో పులి చర్మం పట్టుబడింది. వేటగాళ్లు పులిని చంపి దాని చర్మాన్ని విక్రయిస్తుండగా పోలీసులు, అటవీ శాఖ అధికారులు కలసి జాయింట్ ఆపరేషన్ లో పట్టుకున్నారు.

యాభై రోజుల్లో....
యాభై రోజుల వ్యవధిలో ఆదిలాబాద్ జిల్లాలో రెండు పులి చర్మాలు పట్టుబడటం సంచలనం కల్గిస్తుంది. బేల మండలం సైద్ పూర్ లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆదిలాబాద్ అడవుల్లో పులులు సంఖ్య ఎక్కువగా ఉండటంతో వేటగాళ్లు ఇక్కడ మకాం వేసి వాటిని చంపుతూ సొమ్ము చేసుకుంటున్నారు.


Tags:    

Similar News