Telangana : సంక్షేమ పథకాలు కావాలా? అయితే ఈ దరఖాస్తు పూర్తి చేయాల్సిందే
కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు అందుకోవాలంటే ముందుగా దరఖాస్తును పూర్తి చేసి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది
కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు అందుకోవాలంటే ముందుగా దరఖాస్తును పూర్తి చేసి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా గ్రామసభలు జరగనున్నాయి. వీటికి ప్రజాపాలన అని నామకరణం చేశారు. అయితే రేపు అర్హులైన వారు సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఈరోజు ప్రభుత్వం అప్లికేషన్ ఫారాన్ని విడుదల చేసింది. విడివిడిగా కాకుండా అన్ని సంక్షేమ పథకాలకు ఈ దరఖాస్తు ఫారం సరిపోతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అర్హులైన వారు తాము ఏ పథకానికి దరఖాస్తు చేసుకున్నారో అందులో తెలియచేస్తే చాలు. గ్రామసభల్లో అర్హులైన వారిని అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంపిక చేస్తారు.
అన్ని వివరాలతో పాటు...
కుటుంబ వివరాలతో పాటుగా కుటుంబ యజమాని పేరు, పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నెంబరు రేషన్ కార్డు నెంబర్, మొబైల్ నెంబరు, వృత్తి, కులంతో పాటు కటుంబ సభ్యుల వివరాలను అందులో పేర్కొనాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు ద్వారా మహాలక్ష్మి పథకంతో పాటు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, చేనేత, గృహజ్యోతి వంటి పథకాలకు సంబంధించి లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే పొందాలంటే అక్కడ పొందుపర్చిన చోట టిక్ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలతో ఈ దరఖాస్తులను గ్రామసభల్లో అందచేయాలని ప్రభుత్వం తెలిపింది. నేటి నుంచి దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి. రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకూ గ్రామ సభలు జరగనున్నాయి.
6 గ్యారంటీ ల ప్రజా పాలనా దరకాస్తు ఫారం ని డౌన్లోడ్ చేస్కోండి.
ప్రజా పాలనా దరఖాస్తు ఫారం