KCR : నేడు కోనాయిపల్లికి కేసీఆర్

ఈరోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు.

Update: 2023-11-04 02:36 GMT

ఈరోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. సిద్ధిపేట జిల్లాలోని సంగునూరు మండలంలో ఉన్న కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం పది గంటలకు ఆలయానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన నామినేషన్ ను దాఖలు చేసే ముందు కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

నామినేషన్ వేసే ముందు...
ఈ క్రమంలోనే ఆయన ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డిలలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కోనాయిపల్లి ఆలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు ప్రచార కార్యక్రమానికి కేసీఆర్ విరామాన్ని ప్రకటించారు.


Tags:    

Similar News