Cash Seized : కోట్లు పట్టుబడ్డాయ్... అవన్నీ వారివేనట

ఈరోజు కోట్లాది రూపాయల నగదును తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

Update: 2023-11-27 06:08 GMT

తెలంగాణ ఎన్నికలకు ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు పంచేందుకు సిద్ధమవుతున్నారు. అయితే పోలీసులు వాటిని పెద్దయెత్తున స్వాధీనం చేసుకుంటున్నారు. కోట్లాది రూపాయల సొమ్మును తరలిస్తుండగా పట్టుకుంటున్నారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు, ఫ్లైయింగ్ స్వ్కాడ్ లు కలసి తనిఖీలు ముమ్మరం చేశాయి. తెలంగాణ వ్యాప్తంగా సోదాలు జరుపుతున్నాయి. ఈ సోదాల్లో ఇప్పటి వరకూ 11 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

కోట్ల రూపాయల నగదు...
ఖమ్మం జిల్లాలో పాలేరులో పెద్దయెత్తున నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్లైయింగ్ స్వ్కాడ్ లు ఈ నగదును స్వాధీనం చేసుకుంది. పాలేరులో 3.5 కోట్ల రూపాయలు, ముత్తగూడెంలో ఆరు కోట్లు, రామకగుండంలో రెండు కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులవిగా గుర్తించారు. నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీజ్ చేసిన నగదు ఐటీ శాఖ పరం అవుతుంది.


Tags:    

Similar News