Supreme Court : నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు
ఈరోజు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరగనుంది.
ఈరోజు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ల ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కేసులో ఉండటంతో ఈ కేసు ఆసక్తికరంగా మారింది. అయితే బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి తెలంగాణకు కాకుండా మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని సుప్రీకోర్టును ఆశ్రయించారు.
మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని...
అయితే దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కొందరు ఢిల్లీకి చేరుకుని న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ కేసు జరిగి సుదీర్ఘకాలం అవుతున్నప్పటికీ ఇప్పటి వరకూ న్యాయం జరగలేదని బీఆర్ఎస్ నేతల తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టులో తమ వాదనలను వినిపించనున్నారు.