జూనియర్ ఎన్టీఆర్ కారులో సోదాలు.. బ్లాక్ ఫిలిం తొలగింపు !

కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉండటంతో దానిని ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. హైదరాబాద్ లో బ్లాక్ ఫిలింతో తిరుగుతున్న వాహనాలపై

Update: 2022-03-21 11:56 GMT

హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ కారును జూబ్లిహిల్స్ ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేశారు. కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉండటంతో దానిని ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. హైదరాబాద్ లో బ్లాక్ ఫిలింతో తిరుగుతున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో జూబ్లిహిల్స్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ముత్తు ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బ్లాక్ ఫిలిం ఉన్న వాహనాలను తనిఖీ చేసి.. ఆ తెరలను తొలగించారు.

అలాగే.. గువ్వల బాలరాజు పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్, మేరాజ్ హుస్సేన్, ఏపీకి చెందిన శ్రీధర్ రెడ్డి పేరుతో స్టిక్కర్ ఉన్న వాహనాలను గుర్తించి బ్లాక్ ఫిలింను తొలగించారు. జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్నవారు తప్ప ఇతరులెవరూ వాహనాలపై బ్లాక్ ఫిలిం ఉపయోగించడానికి అనుమితి లేదని పోలీసులు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వాహనం లోపల విజిబులిటీ సరిగ్గా ఉండాలని.. వాహనాలపై అనుమతి లేకుండా బ్లాక్ ఫిలిం వేయొద్దని పోలీసులు హెచ్చరించారు.


Tags:    

Similar News