కాసేపట్లో కూతురి వివాహం.. అంతలోనే విషాదం..

ఇంట్లో పెళ్లి భజా మోగుతోంది. ఇంట్లో పెళ్లి సందడి అంతా ఇంతా కాదు. కాసేపట్లో పెళ్లి. కన్న కూతుర్ని సంతోషంగా వివాహం చేసి అత్తారింటికి పంపుదామనుకున్న ఆ తండ్రికి చివరి రోజు అయిపోయింది. బంధుమిత్రులు, స్నేహితులు, చుట్టుపక్కల వారితో ఆ పెళ్లి పందిరి కళకళలాడుతుండగా, విషాదం నెలకొంది.

Update: 2023-09-04 07:38 GMT

ఇంట్లో పెళ్లి భజా మోగుతోంది. ఇంట్లో పెళ్లి సందడి అంతా ఇంతా కాదు. కాసేపట్లో పెళ్లి. కన్న కూతుర్ని సంతోషంగా వివాహం చేసి అత్తారింటికి పంపుదామనుకున్న ఆ తండ్రికి చివరి రోజు అయిపోయింది. బంధుమిత్రులు, స్నేహితులు, చుట్టుపక్కల వారితో ఆ పెళ్లి పందిరి కళకళలాడుతుండగా, విషాదం నెలకొంది. కుమార్తె పెళ్లి ఉండటంతో ఆ తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. నిద్రలేని రాత్రులు గడిపినా సరే కూతురి వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించాలని భావించిన ఆ పెళ్లి పందిరిలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. కాసేపట్లో పెళ్లి జరుగుతుందని భావించే లోపు ఓ తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అందరు చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి విషాదం ఎక్కడ జరగవద్దని కోరుకుంటారు. కానీ కొన్ని నిమిషాల్లోని పెళ్లి పందిరిలో విషాదం నెలకొంది. ఈ విషాద ఘటన తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్‌పూర్‌ గ్రామానికి చెందిన ఎర్రల రాములు ట్రాక్టర్‌ మెకానిక్‌. రాములు-మంజుల దంపతులకు ముగ్గురు కూతుళ్లు. అయితే పెద్ద కూతురు లావణ్య వివాహం నిశ్చయమైంది. సెప్టెంబర్‌ 3 ఆదివారం ఉదయం పది గంటలకు వివాహ మూహూర్తం ఉంది. ఈ వివాహం కార్యక్రమం సమీపంలోని కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి గుట్టపై జరగాల్సి ఉంది.

కానీ, ఇంతలోనే ఊహించని విషాదం జరిగింది. మరో రెండు గంటల్లో కూతురి పెళ్లి జరగాల్సి ఉండగా.. రాములు ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఛాతిలో నొప్పిగా ఉందంటూ కిందపడిపోయాడు. ఇది గమనించిన బంధువులు వెంటనే హుజురాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. రాములు మరణంతో ఆ పెళ్లి జరగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అందరి ఏడుపుతో దద్దరిల్లిపోయింది. కూతురు పెళ్లి చూడకుండానే కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి తరం కాలేకపోయింది.

Tags:    

Similar News