ట్రాన్స్ జెండర్ పోలీసులు కూడా కావలెను
పలువురు ట్రాన్స్ జెండర్స్ డిజీపీ కార్యాలయానికి వచ్చారు. పోలీస్ ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్స్ కు అవకాశం ఇవ్వాలని.. ఆ విషయాన్ని డిజీపీకి చెప్పాలని వచ్చామని ట్రాన్స్ జెండర్స్ మీడియాకు తెలిపారు.
పోలీసులలో ట్రాన్స్ జెండర్స్ కు కూడా అవకాశాలు ఇవ్వాలని కోరుతూ గత కొద్దిరోజులుగా ట్రాన్స్ జెండర్ సంఘాలు తమ వాయిస్ ను వినిపిస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టులో NALSA vs యూనియన్ ఆఫ్ ఇండియా మరియు నవతేజ్ సింగ్ జోహార్ & ఓర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ట్రాన్స్ జెండర్ వ్యక్తుల (హక్కు ల రక్షణ) చట్టం, 2019 మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల (హక్కు ల రక్షణ) నియమాలు, 2020 అమలులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ట్రాన్స్ జెండర్ సంఘాలు పిలుస్తూ ఉన్నాయి. ఆచరణ కోసం తెలంగాణ పభ్రుత్వం తెలంగాణాలోని ట్రాన్స్ జెండర్ సంఘాలను ఇంకా సంపద్రించలేదని, పజ్రాస్వా మ్యబద్ధంగా సమగ్రట్రాన్స్ జెండర్ విధానాన్ని రూపొందించాలని ట్రాన్స్ జెండర్లు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే లేఖను రాశారు. ఇటీవల విడుదలైన తెలంగాణ పోలీసుల కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్ల రిక్రూట్ మెంట్ లో ట్రాన్స్ జెండర్స్ కు ఎటువంటి కేటాయింపు లభించలేదు. రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ 2022 నుండి ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు కూడా అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
పలువురు ట్రాన్స్ జెండర్స్ డిజీపీ కార్యాలయానికి వచ్చారు. పోలీస్ ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్స్ కు అవకాశం ఇవ్వాలని.. ఆ విషయాన్ని డిజీపీకి చెప్పాలని వచ్చామని ట్రాన్స్ జెండర్స్ మీడియాకు తెలిపారు. అప్లికేషన్స్ లో పురుషులకు, మహిళలకు మాత్రమే అవకాశం ఇచ్చారని.. ట్రాన్స్ జెండర్స్ కోటా కూడా ఇవ్వాలని కోరారు. ట్రాన్స్ జెండర్స్ పోలీస్ ఉద్యోగాలు సాదించగలరని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు లు ఇచ్చాయని గుర్తు చేశారు. పోలీస్ ఉద్యోగాలు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని ట్రాన్స్ జెండర్స్ చెప్పుకొచ్చారు. తెలంగాణ లోని పలు ప్రాంతాల నుండి ట్రాన్స్ జెండర్స్ డీజీపీ ఆఫీసుకు వచ్చారు. ట్రాన్స్ జెండర్స్ లో ఎంతో మంది చదువుకున్న వాళ్ళము ఉన్నామని, తమకు కూడా అవకాశం ఇవ్వాలని కోరారు.