మందుబాబులకు రవాణా శాఖ షాక్

ఈ ఏడాది తాగి వాహనాలు నడిపే వారికి భారీగా జరిమానా వడ్డిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ..

Update: 2023-01-01 09:56 GMT

drunk and drive searches 

మందుబాబులకు తెలంగాణ రవాణా శాఖ షాకిచ్చింది. మద్యంమత్తులో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై రవాణాశాఖ కఠిన చర్యలు చేపడుతోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారి లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేయడంతో పాటు భారీ జరిమానా విధిస్తున్నారు. గతేడాది జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకూ.. రాష్ట్రవ్యాప్తంగా మద్యంసేవించి వాహనాలు నడిపిన 5,819 మంది వాహనదారుల లైసెన్సులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మొదటి రోజే 3,220 మంది వాహనదారులకు షాక్ ఇచ్చారు.

హైదరాబాద్ లో గతేడాది రద్దు చేసిన వాహనదారుల లైసెన్సుల సంఖ్య 4,109 కాగా.. నార్త్ జోన్ లో 1,103, సౌత్ జోన్ లో 1,151, ఈస్ట్ జోన్ లో 510, వెస్ట్ జోన్ లో 1,345 మంది లైసెన్సులు రద్దయ్యాయి. ఈ ఏడాది తాగి వాహనాలు నడిపే వారికి భారీగా జరిమానా వడ్డిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే.. రూ.10 వేలు జరిమానా తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట హైదరాబాద్ లోని పలు ఏరియాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతూ మందుబాబులను అడ్డుకుంటున్నారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News