కీలక నిర్ణయం దిశగా టీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్ర సమితి కీలక నిర్ణయం తీసుకోనుంది. వరిధాన్యం కొనుగోలు చేయాలంటూ పార్లమెంటు సమావేశాల్లో ఆందోళన చేస్తున్నారు;
తెలంగాణ రాష్ట్ర సమితి కీలక నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో వరిధాన్యం కొనుగోలు చేయాలంటూ పార్లమెంటు సమావేశాల్లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు కూడా లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు దీనిపై వాయిదా తీర్మానం ఇచ్చారు. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు గత వారం రోజులుగా ఉభయ సభల్లో ఆందోళన చేస్తున్నారు.
రెండు రోజుల్లో....
అయితే కేంద్ర ప్రభుత్వం దీనిపై దిగి రాలేదు. ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈరోజు టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీ నుంచి వెనక్కు తిరిగి రావాలని నిర్ణయించారు. పార్లమెంటు సమావేశాలు ఈరోజు ముగిసిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశముంది. కేసీఆర్ తో సంప్రదించిన తర్వాత రెండు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.