ఖరీఫ్ సంగతి తేల్చండి... యాసంగిది తర్వాత చూద్దాం

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు తమ డిమాండ్లను గట్టిగా విన్పిస్తున్నారు.

Update: 2021-12-03 08:00 GMT

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు తమ డిమాండ్లను గట్టిగా విన్పిస్తున్నారు. రాజ్యసభ, లోక్ సభల్లో వరి ధాన్యం కొనుగోళ్లపై ప్రశ్నలు వేశారు. రాజ్యసభలో కే. కేశవరావు వేసిన ప్రశ్నకు మంత్రి పియూష్ గోయల్ సమాధానం చెప్పారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ కొంటారా? లేదా? అన్నది మంత్రి స్పష్టం చేయాలని కేశవరావు డిమాండ్ చేశారు. మరో సభ్యుడు సురేష్ రెడ్డి సయితం ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి గింజ కొంటామని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు.

ఈ సీజన్ లో....
అయితే పియూష్ గోయల్ సమాధాన మిస్తూ ముందుగా ఖరీఫ్ ధాన్యం సేకరణ పూర్తికానివ్వమని అన్నారు. తెలంగాణలో పండిన ధాన్యాన్ని మొత్తం తాము సేకరిస్తున్నామని చెప్పారు. ఖరీఫ్ లో ఇంకా మిగిలిపోయిన ధాన్యాన్ని ఇవ్వండని పియూష్ గోయల్ అన్నారు. ఈ సీజన్ లో ఇంకా 29 లక్షల క్వింటాళ్ల ధాన్యం తెలంగాణ ఇవ్వాల్సి ఉందని పియూష్ గోయల్ తెలిపారు. బాయిల్డ్ రైస్ కొనాలని అడగటం సరికాదన్నారు. ప్రతి ఏటా ధాన్యం సేకరణను పెంచుతూనే ఉన్నామని చెప్పారు. తర్వాత రబీ సంగతి చూద్దామని చెప్పారు. లోక్ సభలోనూ టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ధాన్యం సేకరణపై ప్రశ్నించారు.


Tags:    

Similar News