టీఆర్ఎస్ ఎంపీల సంచలన నిర్ణయం
టీఆర్ఎస్ ఎంపీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు.;
టీఆర్ఎస్ ఎంపీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు. పార్లమెంటు సమావేశాల నుంచి వాకౌట్ చేసిన టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది మంది లోక్ సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఈ శీతాకాల సమావేశాలను బహిష‌్కరిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
నల్లచొక్కాలు ధరించి....
తెలంగాణలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఏడు రోజుల నుంచి ఉభయ సభల్లో ఆందోళన చేస్తున్నారు. కాని కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోవడంతో సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాలకు తాము హాజరు కాబోవడం లేదని రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు తెలిపారు. ఈరోజు పార్లమెంటు ఉభయ సభలకు నల్ల చొక్కాలు ధరించి హాజరై తమ నిరసనను వ్యక్తం చేశారు.