లోక్ సభ లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన
గిరిజన రిజర్వేషన్లు పెంచాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో ఆందోళనకు దిగారు.
గిరిజన రిజర్వేషన్లు పెంచాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లకు బదులుగా పెంచాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను పంపినా కేంద్రం పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఆరోపించారు. లోక్ సభ నుంచి టీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేసి తమ నిరనసను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు.
రిజర్వేషన్లను పెంచాలని....
గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలని తాము కేంద్రానికి 2017లో ప్రతిపాదనలను పంపినా పట్టించుకోలేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే దానిని పక్కనపెట్టిందని ఆరోపించారు. అసెంబ్లీ తీర్మానం తమకు పంపలేదని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు సభను, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, ఆయన గిరిజనులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాదు కేంద్ర మంత్రి వర్గం నుంచి బిశ్వేశ్వర్ తుడు ను బర్త్ రఫ్ చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. గిరిజనుల రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచాలని టీఆర్ఎస్ పట్టుబడుతుంది.