టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వీరే

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులుగా న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక ఎండీ దీవ‌కొండ దామోద‌ర్ రావు, హెటిరో అధిప‌తి డాక్ట‌ర్ బండి పార్థ‌సార‌థి రెడ్డి, వద్దిరాజు ర‌విచంద్ర‌(గాయ‌త్రి ర‌వి) పేర్ల‌ను సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు.

Update: 2022-05-18 12:27 GMT

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులుగా న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక ఎండీ దీవ‌కొండ దామోద‌ర్ రావు, హెటిరో అధిప‌తి డాక్ట‌ర్ బండి పార్థ‌సార‌థి రెడ్డి, వద్దిరాజు ర‌విచంద్ర‌(గాయ‌త్రి ర‌వి) పేర్ల‌ను సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు. మూడు సీట్లలో ఇద్దరు ఓసీలు, ఒక బీసీని ఎంపిక చేశారు సీఎం కేసీఆర్. బండి పార్థసారథి రెడ్డి హెటిరో గ్రూప్ చైర్మెన్ కాగా, వద్దిరాజు రవిచంద్ర గ్రానైట్ వ్యాపారి, దీకొండ దామోదర్ రావు ప్రముఖ వ్యాపారవేత్త, నమస్తే తెలంగాణ ఎండీ.దామోదర్ రావు మొదటి నుంచి సీఎం కేసీఆర్ కు సన్నిహితుడిగా ఉన్నారు.

వద్దిరాజు రవిచంద్ర:
ఖమ్మం జిల్లాకు చెందిన గ్రానెట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర పేరును సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారని ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. రవి చంద్ర కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గతంలో కాంగ్రెస్ లో పని చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేశారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అత్యంత సన్నిహితుడని చెబుతూ ఉంటారు.

దీవ‌కొండ దామోద‌ర్ రావు:
1958 ఏప్రిల్ 1న జ‌న్మించిన దీవ‌కొండ దామోద‌ర్ రావుకు భార్య‌, కూతురు, కుమారుడు ఉన్నారు. జ‌గిత్యాల జిల్లా బుగ్గారం మండ‌లం మద్దునూరుకు చెందిన దామోద‌ర్ రావు తెలంగాణ ఉద్య‌మం సమయం నుండి కేసీఆర్ వెంట ఉన్నారు. 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ప‌లు హోదాల్లో ప‌ని చేశారు. పొలిట్ బ్యూరో స‌భ్యుడిగా, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, పార్టీ సెక్ర‌ట‌రీ – ఫైనాన్స్‌గా వ్య‌వ‌హ‌రించారు. తెలంగాణ ప‌బ్లికేష‌న్స్‌(న‌మ‌స్తే తెలంగాణ‌, తెలంగాణ టుడే దిన‌ప‌త్రిక‌లు) కు చైర్మ‌న్, మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

పార్థ‌సార‌థిరెడ్డి
ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లికి చెందిన బండి పార్థ‌సార‌థిరెడ్డి హెటిరో డ్ర‌గ్స్ వ్య‌వ‌స్థాప‌కులు. వేంసూరు మండ‌లం కందుకూరు గ్రామంలో జ‌న్మించిన పార్థ‌సార‌థిరెడ్డి డిగ్రీ పూర్తి చేసి ఓ ప్ర‌యివేటు కంపెనీలో ప‌ని చేస్తూనే హెటిరో సంస్థ‌ను స్థాపించారు. త‌న సంస్థ ద్వారా దాదాపు ప‌ది వేల మందికి పైగా ఉద్యోగుల‌కు ఉపాధి క‌ల్పిస్తున్నారు. ప‌లు విద్యాసంస్థ‌లు స్థాపించి విద్యావేత్త‌గా సేవ‌లందిస్తున్నారు.


Tags:    

Similar News