మహిళలకు ప్రయాణం ఉచితం
మహిళా దినోత్సవం సందర్భంగా టీఎస్ఆర్టీసీ మహిళలకు గిఫ్ట్ ప్రకటించింది. ఈరోజు మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించింది
మహిళా దినోత్సవం సందర్భంగా టీఎస్ఆర్టీసీ మహిళలకు గిఫ్ట్ ప్రకటించింది. ఈరోజు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ నిర‌్ణయం తీసుకుంది. ప్రత్యేకంగా మహిళలకు ఆఫర్లు కూడా ప్రకటించింది. అరవై ఏళ్లు దాటిన మహిళలకు ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమని చెప్పింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ ఒక్కరోజే.....
ఈ అవకాశం మహిళ దినోత్సవం సందర్బంగా ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. హైదరాబాద్ సిటీలో మహిళల కోసం ట్రిప్పుల సంఖ్యను మరింత పెంచనున్నామని అధికారులు చెబుతున్నారు. దీంతో తెలంగాణలోని అన్ని బస్టాండ్ లలో ఉండే స్టాళ్లకు మహిళ వ్యాపారుల నుంచి రుసుం తీసుకోమని చెప్పారు. ఈ నెల 31వ తేదీ వరకూ ఉచితంగానే స్టాళ్లను కేటాయించనున్నారు.